
Mutyala Bandham
విభిన్న ఆలోచనా ప్రవాహం కల్గిన నలభై మంది రచయిత/త్రుల నుండి అరవైకు పైగా కథలను సేకరించి వాటిలో కథనం ప్రాముఖ్యంగా ఉన్న పదిహేడు కథలను ఎంచి 'ముత్యాల బంధం' గా సంపాదకత్వం నిర్ణయించింది. ఈ పుస్తకం బంధంలోని అన్ని కోణాలు విశ్లేషించడానికి, పాఠకులతో పంచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది. బంధాలు, సంబంధాలు, స్నేహం, సమాజం, వ్యసనాలు వంటి కఠినమైన అనేక అంశాలను కవర్ చేస్తూ ఒక్కో కథగా వివరించింది. ప్రతి కథ జీవితంలోని అవగాహన యొక్క ప్రాముఖ్యతను తాదాత్మ్యం చెందేటట్లు చేస్తుంది. ముత్యాల బంధం కథలు.. జీవితంలోని సంక్లిష్టతలను పరిశోధిస్తాయి, విభిన్న కోణాలలో ఆలోచించేటట్లు చేసి సలహాలను అందిస్తాయి. ప్రతీ కథలోను ఏదో మెరుపు, మరేదో మలుపుతో కొత్త కోణాలను అంతర్లీనంగా చెబుతూ, పాఠకులని చివరిదాకా స్పష్టతతో ఊపిరి బిగపట్టుకుని చదివిస్తూ అంతులేని అనుభూతినిస్తుంది. ఈ కథలలోని కథన శైలి పాఠకుల అనుభవాల పరిధితో కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తున్నాయి.
- ISBN
- 9788196611637
- Språk
- Telugu
- Vikt
- 310 gram
- Utgivningsdatum
- 2024-02-14
- Förlag
- Kasturi VIjayam
- Sidor
- 148
