Gå direkt till innehållet
Maa Vorigipalli Gevanaalu
Spara

Maa Vorigipalli Gevanaalu

Lägsta pris på PriceRunner

ఆచార్య మహాసముద్రం దేవకి గారు రాబోవు తరాల వారికి తెలుగు పల్లె ప్రజల జీవనవిధానం, మానవత్వ సంబంధాల గురించి చెప్పాలనే ఉద్దేశంతో తన గ్రామీణానుభవాలను కథ సాహిత్య రూపంలో చెప్పిన సంపుటి ఈ "మా వొరిగి పల్లి ముచ్చట్లు".

పాఠకులుగా ఆరు దశాబ్దాల పాటు సాగిన ఈ ముచ్చట్లను చదివేటప్పుడు విస్మయపడతాం. ప్రతి కథ వెనుక దాగివున్న మానవ మమకారపు తీపి గుర్తులను పంచుకున్న తీరే అద్భుతమనిపిస్తుంది. రచయిత్రి తన శైలి మొత్తం స్త్రీల చుట్టూతా ఉండే జీవితమూ, సంఘర్షణ చుట్టూ నడవటాన్ని ఈ కథల్లో బలంగా ఉంటుంది.

మచ్చుకి 'కస్తూరి' కథ చదివితే, మనం విషాదయోగంతో స్నేహం చేస్తాం. కస్తూరి కి చదువంటే ఎంత ఇష్టమో చూపిస్తూనే, ఆ అమ్మాయిని దున్నపోతు లాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తారు. కస్తూరి కుటుంబం పై తిరుగుబాటుగా ఆత్మహత్య చేసుకుంటుంది. అది మొదలు ఎవరికైనా యిష్టం లేని పెళ్లి చేస్తే ఒట్టు ఆ ఉరి మొత్తంలో. చచ్చి సాధించిన కస్తూరి విజయమదని రచయిత్రి కీర్తిస్తారు.

మరుగున పడిపోతున్న ప్రాంతీయ మాండలికాలకు ఈ కథల్లో ప్రాణ ప్రతిష్ట జరిగిందనడలో అతిశయోక్తి లేదు . ఆ ప్రాంతం వాళ్లు కూడా అబ్బురపడే మాండలికాలు ఈ కథల్లో కనిపిస్తాయి.

'మా వొరిగి పల్లి ముచ్చట్లు' ది కథా సాహిత్యంలో ఒక విభిన్నత . ఈ ముచ్చట్లను మనం చదువుకొని మురిసిపోవాల్సిందే.

ISBN
9788196307554
Språk
Telugu
Vikt
310 gram
Utgivningsdatum
2023-06-20
Sidor
174