Gå direkt till innehållet
Siva Drusti
Spara

Siva Drusti

Författare:
Telugu
జగత్ సృష్టికర్త అయిన శివ పరమాత్ముడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మరియు జీవాను జీవములను సృష్టించినవాడై యుండెను. ఈ జగత్ వ్యవహారములకు కారణ భూతుడయిన శివపరమాత్ముడు జ్యోతిస్వరూపుడై యున్నాడు. సృష్టి యొక్క ఆదిమధ్యాంతముల జ్ఞానమును తెలిసిన వాడును అట్లే అవినాశియు అయివున్నాడు. భయంకర దుఃఖ దుర్మనాదుల స్మరణ మాత్రము చేత. నివారించ తెలిసినవాడై యున్నాడు. సత్యజ్ఞాన అనంత రూపియై యున్నాడు. నిరాకార నిర్గుణ నిష్ఠపంచక అవినాశి నిత్య సంతోషదాయక విశ్వకళ్యాణకారక పరమ పవిత్ర పతితపావన సర్వాంతర్యామి సర్వజ్ఞ స్వరూపుడై లయ ఉత్పత్తులకులోను కాక ఉన్నట్టి శివపరమాత్ముని విశ్వమందలి జనత, వివిధ నామములతో పిలుచుచూ పూజించుచున్నారు. ఇట్టి పరమ శివుణ్ణి వీరశైవులు లింగ స్వరూపముచేత సదా దేహాంగము మీద ధరించి పూజించినట్లు యితరులు వివిధ స్వరూపముల పూజించుట కానవచ్చుచున్నది.ఇట్టి పరమశివుని వర్ణనను శివదృష్టి అను గ్రంథము చేత జనులకు తెలుగు భాషయందు శ్రీమాన్ విద్వాన్ చొప్ప వీరభద్రప్ప గారు రచించి ప్రకాశమొనరించుట స్తుతింపదగినదై యున్నది. అయినంత తొందరలో ఈ గ్రంథము ప్రకాశ రూపము ధరించి జనులకు అతి త్వరలో లభించునట్లు కావలయునని ఆశించడమయినది.ఇత్యాశిషః
శ్రీ జగద్గురు శ్రీశైల సూర్యసింహాసనమఠ్ అధికార స్థానం, శ్రీశైలం.
Författare
ISBN
9788196229146
Språk
Telugu
Vikt
310 gram
Utgivningsdatum
2023-03-05
Förlag
UNKNOWN
Sidor
98