
Vividha
'వివిధ' నేను తీసుకు వస్తున్న వ్యాస సంపుటి. కథ, వ్యాసం అంటే నాకిష్టం. గడిచిన నాలుగు దశాబ్దాలుగా వీటి పైన కృషి చేస్తున్నాను. అంతర్జాతీయ, జాతీయ స్థాయి సదస్సులలో ప్రత్యక్షంగా, పరోక్షంగా (వెబినార్) పత్ర సమర్పణలు చేశాను. ప్రశంసలు, విమర్శలు అందుకున్నాను.ఓ మూడు వ్యాస సంపుటాలు ప్రచురించాను. కాగితాన్ని దాచుకుంటే చివికి పోయి శిథిలమయ్యే ప్రమాదముంది. నా వ్యాసాలు చరిత్ర శకలాలలోకలిసి పోతాయి. అలా కాకుండా నాకంటూ ఓ ఉనికి, అస్థిత్వం కోసమే క(న)ష్టమైనా పుస్తకంగా ప్రచురిస్తున్నాను. మిత్రులు తమ వంతు సహకారం అందిస్తున్నారు.వారికి ధన్యవాదాలు.నా మిత్రుడు చంద్రశేఖర్ నాకు వెన్ను దన్ను.సాహితీ మిత్రులు డా.ర్యాలీ శ్రీనివాస్, పెద్దలు వారణాశి సత్తిబాబు దంపతులు, మా కళాశాల ప్రిన్సిపాల్ మృదు వచస్వి డా.పులఖండం శ్రీనివాస రావు, గురజాడ విద్యాసంస్థల అధినేత శ్రీ.జి.వి.స్వామి నాయుడు గారు, ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ సదాశివుని కృష్ణ గారికి, నా తమ్ముడు అందరికీ ఈ సందర్భముగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.ఈ పుస్తకాన్ని అందంగా ముద్రిస్తున్న 'కస్తూరి విజయం'వారికి ధన్యవాదాలు.
- ISBN
- 9788198272973
- Språk
- Telugu
- Vikt
- 310 gram
- Utgivningsdatum
- 2025-05-10
- Förlag
- Kasturi VIjayam
- Sidor
- 110
